పక్షి (ప్రకృతి) ప్రకోపం.. తల పట్టుకుంటున్న అమెరికా 

Bird (nature) rage.. America holding its head

Jan 18, 2025 - 11:43
 0
పక్షి (ప్రకృతి) ప్రకోపం.. తల పట్టుకుంటున్న అమెరికా 

లాస్​ ఏంజెల్స్​ భస్మిపటలం
రూ. 20 లక్షల కోట్ల నష్టం
రోడ్డున పడ్డ హాలీవుడ్​ నటులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: అమెరికాపై ప్రకృతి ప్రకోపించింది. ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా ప్రకృతి దెబ్బకు విలవిల్లాడిపోతూ, పోరాడలేక చేతులెత్తోస్తుంది. ప్రపంచంలో తామే అత్యంత ధనిక, పెద్ద, ముందువరుసలో ఉన్న దేశమని ప్రకటించుకున్న దేశానికి ప్రకృతితో మమేకం కాలేక, పోరాడలేక తలలు పట్టుకుంటోంది. లాస్​ ఏంజెల్స్​ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కాస్త 35కిలోమీటర్ల ప్రాంతాన్ని పూర్తిగా భస్మిపటలం చేసింది. 3 లక్షల 21వేల ఎకరాల్లో దావనంలా మంటలు వ్యాపించి గత వారం పది రోజులుగా చల్లారడం లేదు. ప్రకృతితో పోరాడే శక్తి మానవాళికి లేదనే విషయం చరిత్రలో మరోసారి స్పష్​టం అవుతుంది.

చల్లారని అగ్నిదేవుడి ఆగ్రహం..
లాస్​ ఏంజెల్స్​ పర్వత, అటవీ ప్రాంతం. ఇక్కడ చిన్న అగ్నికీలలు మొదలైన మంటలు అప్పటికే అక్కడ వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు తోడై ఒక్కసారిగా 200 మీటర్ల ప్రాంతంలో చెట్లు చేమలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఆలస్యం చేయకుండా అధికారులకు సమాచారం అందజేశారు. వారు వచ్చేంతలోపే మంటలు గాలుల వల్ల నిప్పురవ్వలు ఎగిసిపడి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, చెట్లు, చేమలు, కార్లు తదితరాలకు అంటుకున్నాయి. దీనికి తోడు గాలులు భారీగా వీస్తుండడంతో ఫైర్​ ఇంజన్​ లు మంటలార్పేందుకు ప్రతిబంధకంగా మారాయి. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే ప్రత్యేక విమానాలను రంగంలోకి దింపారు. ఓ వైపు ఫైర్​ ఇంజన్​ లు మంటలు వ్యాపిస్తుండడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయినా చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఈ లోపు గాలుల వేగం కాస్త మరింత పెరిగింది. ఏకంగా 35 కిలోమీటర్ల ప్రాంతంలో నిప్పురవ్వలు గాలులకు ఎగిసిపడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఏమిచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అధికారులు తమ పని తాము చేసుకుంటూనే పోతున్నారు. అయినా అగ్ని దేవుడి ఆగ్రహం నేటికి చల్లారడం లేదు. 

అగ్నికీలలకు పక్షే కారణమా?..
అగ్గిరాజుకునేందుకు ఓ వ్యక్తి కారణమై ఉంటాడని గుర్తించి అతన్ని అరెస్టు చేసి విచారించారు. కానీ అతను కారణం కాదని గుర్తించారు. శాస్ర్తవేత్తల సూక్ష్మ పరిశీలనలో అగ్ని వ్యాపించేందుకు ఓ రకమైన పక్షి ‘ఫైర్​ స్పిట్టింగ్​ బర్డ్​’ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి ఆధారాలు లభించకపోయినా ఈ పక్షి తన ఆహారాన్ని సంపాదించుకునేందుకు ఈ విధమైన అగ్నిప్రమాదాలకు కారణమవుతుందని పలువురు శాస్ర్తవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. లాస్​ ఎంజెల్స్​, కాలిఫోర్నియా మంటలకు కూడా ఇదే కారణమనే అనుమానాలున్నాయి. ఏది ఏమైనా ఓ చిన్న పక్షి మొత్తం అమెరికాకే ముచ్చెమటలు పట్టించింది. ప్రపంచాన్ని ఎదుర్కొంటామని జబ్బలు చరుచుకునే పెద్దన్నకు పక్షిని ఓడించే సత్తా లేదనే ప్రకృతి రూపంలో ఋజువైపోయింది. 

చేతులెత్తేసిన ఇన్సూరెన్స్​ సంస్థలు..
40వేల ఎకరాల్లో పంట బూడిదపాలైంది. 3 లక్షల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న నగరంలోని ప్రజలంతా తలదిక్కుకూ పారిపోయారు. ఇళ్లలోని సామాన్లన్నీ వదిలేసి ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు తమ స్వంత వాహనాలను ఆశ్రయించారు. మరోవైపు మంటలు తీవ్రంగా వ్యాపిస్తుండడంతో అందరూ ఒకేసారి లాస్​ ఏంజెల్స్​ నుంచి బయట పడాలనే ఉద్దేశ్యంతో వాహనాల్లో బయటికి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. మంటలు సమీపించగా వాహనాలన్నీ రోడ్లపైనే వదిలి పరుగులు తీశారు. వాహనాలు కాలిబూడిదయ్యాయి. ఇన్సూరెన్స్​ కంపెనీలు చేతులెత్తేశాయి. మాకేమీ సంబంధం లేదని, ఇది ప్రకృతి వైపరీత్యమని ఖరాఖండిగా తేల్చి చెప్పేశాయి. హాలీవుడ్​ ప్రముఖుల ఇళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. శనివారం వరకు రూ. 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇది భారత మూడేళ్ల రక్షణ బడ్జెట్​ కంటే ఎక్కువ. జనవరి 7 నుంచి కొనసాగుతున్న అగ్నికీలలు నేటికి చల్లారడం లేదు. అమెరికా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.