అమెరికాలో టోర్నోడో బీభత్సం

34 మంది మృతి, 50 మందికి గాయాలు

Mar 16, 2025 - 15:32
 0
అమెరికాలో టోర్నోడో బీభత్సం

వాషింగ్టన్​: అమెరికా మిస్సౌరీలో భారీ తుపాను సంభవించింది. ఈ తుపాను కారణంగా 34 మంది మృతి చెందారు. టోర్నడో (సుడిగాలి)తో కూడిన ఈ తుపానులో వేలాది ఇళ్లపైకప్పులు ఎగిపోయాయి. మిస్సౌరీలోని బేకర్స్​ ఫీల్డ్​ లో ఒక్కసారిగా సంభవించిన తుపానుతో భారీ నష్టం సంభవించింది. తుపాను కారణంగా వివిధ ప్రాంతాల్లో 34 మృతిచెండగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇళ్లు ధ్వంసం, విద్యుత్​ లైన్లు, చెట్లు కూలిపోవడం, పరిసరాల్లో ఉన్న వాహనాలు గాలికి కొట్టుకుపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఆర్కాన్సాస్​ అధికారులు ప్రకటించారు. శనివారం చోటు చేసుకున్న ఈ టోర్నడో తుపానుతో లూసియానా, మిస్సిస్సిపీ, అలబామా, ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్​, కాన్సాస్​ తదితర రాష్ర్టాల్లో ముప్పు సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కాగా తుపాను కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఇప్పటికే రెస్క్యూ చర్యలు పెద్ద ఎత్తున ప్రారంభించామని అధికారులు ప్రకటించారు.