పాక్ ఆర్మీపై బీఎల్ ఎ దాడి
BLA attack on Pakistan Army

ఇస్లామాబాద్: పాకిస్థాన్ భద్రతా దళాలపై ఆదివారం బీఎల్ ఎ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) విరుచుకుపడింది. బస్సులో ప్రయాణిస్తున్న జవాన్లపై ఆత్మాహుతి దాడికి దిగింది. ఈ దాడిలో 90మంది పాక్ జవాన్లు మృతిచెందినట్లు బీఎల్ ఎ ప్రకటించగా, పోలీసులు మాత్రం ఐదుగురు మృతి చెందినట్లు ప్రకటించారు. ట్రైన్ హైజాక్ తరువాత ఇది మరో పెద్ద దాడి. నౌషిక్ హైవే ద్వారా వెళుతున్న పాక్ ఆర్మీ జవాన్ల కాన్వాయ్ పై కారులో భారీ మందుగుండు సామాగ్రితో ఢీకొట్టారు. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకొని బస్సు పూర్తిగా కాలిబూడిదయ్యింది. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. కాగా పాక్ కాన్వాయ్ లో వస్తున్న మిగతా వాహనాలు దూరంగా ఉండడంతో దాడి నుంచి తప్పించుకున్నారు. బీఎల్ ఎ దాడిని వీరు ఎందుకు అడ్డుకోలేకపోయారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.