20 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​

IMD alert for 20 states

Aug 25, 2024 - 15:24
 0
20 రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రానున్న రెండు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం అలర్ట్​ ను జారీ చేసింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్​ లను జారీ చేసింది. ఆదివారం నుంచి మంగళవారం ఈ అలర్ట్​ ను జారీ చేసింది. 20 రాష్ట్రాల్లో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్​, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, సిక్కిం, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర కర్ణాటక, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా,  ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా వర్షాలు ఐఎండీ అంచనా వేసింది.