బంగ్లాలో హిందూ మహిళ ఆత్మహత్య

Hindu woman commits suicide in bungalow

Dec 28, 2024 - 16:05
 0
బంగ్లాలో హిందూ మహిళ ఆత్మహత్య

ఢాకా: బంగ్లాదేశ్​ లో దారుణం చోటు చేసుకుంది. లైంగికదాడికి గురైందనే ఆరోపణలున్న హిందు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఈ విషయం వెలుగులోకొచ్చింది. మహిళ ఆత్మహత్యపై ఆమె కుమారుడు రింకూ మాట్లాడుతూ.. తన తల్లిపై సామూహిక లైంగికదాడి జరిగిన తరువాత ఆమె ముభావంగా ఉందని పేర్కొన్నారు. తీవ్ర మానసిక వేదనను అనుభవించిందన్నాడు. లైంగికదాడి జరిగిన రోజు ఆమె ఆరోగ్యం క్షీణించిందని ఆసుపత్రిలో చేర్చామన్నాడు. గ్రామానికి చెందిన కొందరు యువకులే తాము హిందువులమన్న కారణంతో తన తల్లిని వేధించేవారన్నారన్నాడు. దీన్ని తట్టుకోలేక విషం తాగిందని తెలిపాడు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు భోరుమన్నాడు. మహిళ మృతదేహాన్ని స్వగ్రామంలో ఖననం చేశారు. కాగా  హిందూ మహిళ ఆత్మహత్యపై స్థానిక పోలీసు అధికారి స్పందిస్తూ.. కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. ఒకవ్యక్తిని అరెస్టు చేశామన్నారు. పోస్టుమార్టం వచ్చిన అనంతరం మృతికి కారణాలు తెలుస్తాయన్నారు.