రష్యాలో హెలికాప్టర్​ అదృశ్యం

22 మంది ఆచూకీ గల్లంతు

Aug 31, 2024 - 16:08
 0
రష్యాలో  హెలికాప్టర్​ అదృశ్యం

మాస్కో: రష్యాలో హెలికాప్టర్​ అదృశ్యమైంది. ఈ విమానంలో మొత్తం 22 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం ముగ్గురు సిబ్బంది, 19 మంది పర్యాటకులతో కలిసి ఎంఐ–8టీ నికోలెవ్కా పర్యటక ప్రాంతానికి ఈ విమానం బయలుదేరిందన్నారు. కమ్​ చట్కాప్రాంతంలోని వాచ్‌కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని విమనం అదృశ్యమైనట్లు గుర్తించామన్నారు. హెలికాప్టర్​ సరస్సులో పడిపోయిందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం బృందాలను రంగంలోకి దింపామన్నారు. అయితే హెలికాప్టర్​ కూలిన ఖచ్చితమైన ప్రాంతం కోసం బృందాలు, మరో రెండు హెలికాప్టర్లు వెతుకుతున్నాయన్నారు. రష్​యాలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని చూసేందుకు మాస్కోనుంచి ప్రైవేట్​ హెలికాప్టర్లు నడుపుతుంటారు. ఇందులోనే భారీగా పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు సందర్శిస్తుంటారు.