ఘనంగా గణతంత్ర వేడుకలు
రాజ్ పథ్ లో జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ముర్మూ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్ పథ్ లో త్రివర్ణ పతాకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఎగురవేశారు. ఆదివారం ఉదయం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూ ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖులు ముందుగా యుద్ధ స్మారకం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈసారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రాష్ట్రపతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
గణతంత్ర వేడుకల్లో సాంస్కృతిక శాఖ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంతో కవాతు నిర్వహించారు. 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలను వాయిస్తూ కవాతులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇండోనేషియా సైనిక సిబ్బంది బృందం డ్యూటీ పాత్ పరేడింగ్లో పాల్గొంది. భారత ఆర్మీ సైనికులు భీష్మ ట్యాంక్, పినాక మల్టీ లాంచర్ రాకెట్ సిస్టమ్‌తో పరేడ్ నిర్వహించారు.
ఎయిర్ ఫోర్స్ ఫ్లైపాస్ట్‌లో 40 విమానాలు పాల్గొన్నాయి. ఇందులో 22 యుద్ధ విమానాలు, 11 రవాణా విమానాలు, 7 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. అపాచీ, రాఫెల్, గ్లోబ్ మాస్టర్ ఈ ఫ్లై పాస్ట్‌లో దర్శనమిచ్చాయి. పరేడ్‌లో 15 రాష్ట్రాలు, 16 మంత్రిత్వ శాఖలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలను ప్రదర్శించారు. తొలిసారిగా ఐదు వేల మంది కళాకారులు గణతంత్ర వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలిచ్చారు.
ఈ వేడుకల్లో గ్రామాల సర్పంచ్‌లు, హస్తకళలు, చేనేత కళాకారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, రోడ్డు నిర్మాణ కార్మికులు సహా 34 విభాగాల్లో పది వేల మంది ప్రత్యేక అతిథులను పాల్గొన్నారు.