కశ్మీర్​ అంశంపై పాక్​ కు నిరాశే

ఇరాన్​ తో ప్రకటనకు ఒత్తిడి ససేమిరా అన్న తీరులో రైసీ ప్రసంగం మోదీ విదేశాంగ నీతి వల్లే భారత్​ కు పెరుగుతున్న మద్దతు

Apr 23, 2024 - 14:48
 0
కశ్మీర్​ అంశంపై పాక్​ కు నిరాశే

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: కశ్మీర్​ అంశంలో తాము వేలు పెట్టడమే గాకుండా ఇరాన్​ చేత కూడా ఏదైనా అనిపించాలని పాక్​ చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మూడు రోజుల పర్యటన సందర్భంగా ఇరాన్​ అధ్క్షుడు ఇబ్రహీం రైసీ పాక్​ కు వచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల అనంతరం పాక్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్​, ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మీడియాతో మాట్లాడారు. అయితే పాక్​ ప్రధాని కశ్మీర్​ అంశంలో ఇరాన్​ తమకు మద్దతునిచ్చే అంశాన్ని ప్రస్తావించారు. కశ్మీర్​ పై ఇరాన్​ తో ఏదైనా మాట్లాడించాలని చాలానే ప్రయత్నించారు, బుజ్జగించినట్లు ఆయన మీడియా పాఠవం కనిపించింది. ఇదే సమయంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ కశ్మీర్​ అంశంపై ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో పాక్​ లో తీవ్ర నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి. 

రైసీ కేవలం పాలస్తీనా అంశాన్ని ప్రస్తావించారు. వారికి ఇరాన్​ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్​ చర్యలను బట్టి చూస్తే కశ్మీర్​ అంశంలో తలదూర్చాలని అనుకోవడం లేదని స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు తెలిపారు. భారత్​ తో సత్సంబంధాల నేపథ్యంలో ఈ అంశంపై అసలు మౌనం వహించడమే సమాధానంగా వ్యవహరించారు. ఇటీవలే పాక్​ అధ్యక్షుడు ఇరాన్​ వెళ్లినప్పుడు కూడా అంతర్గతంగా ఇరువురి మధ్య జరిగిన చర్చల్లో కశ్మీర్​ అంశం తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారని వార్తలు వెలువడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం అంతర్జాతీయ సమాజం ముందు కశ్మీర్​ అంశంలో తలదూర్చేది లేదని తేల్చి చెప్పినట్లుగా స్పష్టం అవుతోంది. 

దీంతో పాక్​ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఇజ్రాయెల్​ – ఇరాన్​ ల మధ్య ఓ వైపు తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నా ఇరాన్​ పాక్​ కు సహాయం చేసేందుకు ఒప్పుకుంది. దాన్ని అవకాశ వాదంగా తీసుకున్న పాక్​ మరింత ముందుకు వెళదామని ప్రయత్నించి విఫలమైనట్లు ప్రపంచదేశాలకు కూడా స్పష్టంగా తెలిసేలా చేసుకుంది. 


ఇటీవల ఇజ్రాయెల్​, ఇరాన్​ అధ్యక్షులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషణలు జరిపారు. పలుమార్లు ఇరుదేశాలకు శాంతి సందేశం ఇచ్చారు. అదే సమయంలో ఇరుదేశాల్లోని భారతీయుల క్షేమంపై కూడా ఆందోళన వెలిబుచ్చారు. మోదీ విదేశాంగ నీతికి, భారత్​ త అత్యున్నత స్థాయి దౌత్య సంబంధాల నేపథ్యంలో ఇరుదేశాలు భారత్​ కు అభయహస్తం ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ప్రపంచదేశాలు కశ్మీర్​ అంశంపై మౌనం వహిస్తేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశాయి. ఈ పరిణామాలన్నీ మింగుడు పడక చైనా కూడా అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికపై కశ్మీర్​, అరుణాచల్​ అంశాలను తెరపైకి తెస్తుండగా, తాజాగా భారత్​ గట్టి సమాధానమే చెప్పింది.