వన్డేలకు స్టీవ్​ స్మిత్​ గుడ్​ బై

Good bye to Steve Smith for ODIs

Mar 5, 2025 - 14:43
 0
వన్డేలకు స్టీవ్​ స్మిత్​ గుడ్​ బై

కాన్​ బెర్రా: ఛాంపియన్స్​ ట్రోఫీ సెమీఫైనల్​ లో ఓటమి తరువాత బుధవారం ఉదయం ఆస్ర్టేలియా కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​ వన్డే క్రికెట్​ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్​ బోర్డు ప్రకటిచింది. ప్రకటన వెలువడిన వెంటనే జట్టు సభ్యులకు కూడా స్మిత్​ తన రిటైర్​ మెంట్​ గురించి చెప్పారు. కాగా అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లు, టీ20 మ్యాచ్‌లకు స్మిత్ అందుబాటులో ఉంటాడు. ఈ సందర్భంగా స్మిత్​ సోషల్​ మీడియాలో ప్రకటన విడుదల చేశాడు. ‘నా వన్డే అధ్యాయాన్ని ముగించే సమయం ఆసన్నమైందని, పసుపు జెర్సీ ధరించి రెండు ప్రపంచ కప్‌లలో ఈ జట్టులో భాగమైనందుకు నేను గర్వపడుతున్నానని, మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు. 2010లో స్టీవ్​ స్మిత్​ వెస్టిండీస్​ తో జరిగిన తొలి మ్యాచ్​ ఆడారు. ఇప్పటివరకు 170 వన్డేల్లో 43.2 రన్​ రేట్​ తో 5800 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్​ సెంచరీలున్నాయి. 28 వికెట్లు తీసుకున్నాడు. 2015, 2023 ఐసీసీ ప్రపంచకప గెలిచిన ఆస్ర్టేలియా జట్టులో స్మిత్​ కూడా ఉన్నాడు. 2015లోన స్మిత్​ కెప్టెన్సీ పగ్గాలు దక్కించుకున్నాడు.