బీఎస్పీ జాతీయ సమన్వయకర్తల నియామకం
Appointment of BSP National Coordinators

లక్నో: జాతీయ సమన్వయ కర్తలుగా రాజ్యసభ ఎంపీలు రాంజీ గౌతమ్, రణధీర్ బెనివాల్ లు వ్యవహరిస్తారని బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) అధ్యక్షురాలు మాయవతి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆనంద్ కుమార్ బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. ఆనంద్ కుమార్ ఉపాధ్యక్షుడిగా ఉంటూనే తన మార్గదర్శకత్వంలో బాధ్యతలను నిర్వర్తిస్తారన్నారు. నూతనంగా జాతీయ సమన్వయ కర్తలుగా నియమించిన బడిన వారు కూడా తన మార్గదర్శకత్వంలోన వివిధ రాష్ట్రాల బాధ్యతలను నేరుగా నిర్వహిస్తారని చెప్పారు. పూర్తి నిజాయితీ, సమగ్రతతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు.