మహాకుంభ్ లో గౌతమ్ అదానీ ప్రసాదం తయారీలో బిజీబిజీ
Gautam Adani is busy preparing Prasadam in Mahakumbh
లక్నో: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మంగళవారం ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ్ కు చేరుకున్నారు. ఇక్కడ తన సంస్థ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహాయంతో 50 లక్షల మందికి నిత్యాన్నదానాన్ని పర్యవేక్షించారు. ఆయనే స్వయంగా గరిటపట్టి ప్రసాదాన్ని వండారు. ఈ సందర్భంగా పలువురు ఇస్కాన్ ప్రముఖులతో కలిసి వంటశాలను పరిశీలించారు. సామాగ్రి అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మహాప్రసాద వితరణలో ఇస్కాన్ సహాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రసాదం తయారీ అనంతరం భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగే మహాకుంభ్ మేళాలో రోజుకు 50 లక్షల మందికి అదానీ సంస్థ అన్నదానం చేస్తుంది.