భేటీ బచావో.. భేటీ పడావో పదో వార్షికోత్సవం

Bheti Bachao.. 10th Anniversary of Bheti Padao

Jan 21, 2025 - 14:30
 0
భేటీ బచావో.. భేటీ పడావో పదో వార్షికోత్సవం

విజ్ఞాన భవన్​ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భేటీ బచావో.. భేటీ పడావో 10వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం న్యూ ఢిల్లీ విజ్ఞానభవన్​ లో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అన్నపూర్ణాదేవిలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కార్యక్రమ లక్ష్యాలను వివరించనున్నారు. 2015 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ బచావో.. బేటీ పడావోను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో బాలికల రక్షణ, విద్య, వైద్యం, సాధికారతలో మెరుగుదల ఏర్పడింది. 2014–15లో జాతీయ లింగ నిష్పత్తి 918గా ఉంది. 2023–24ఇది 930కి పెరిగింది. మాధ్యమిక బాలికల విద్య నిష్పత్తి 75 శాతం నుంచి 78 శాతానికి పెరిగింది. గర్భీణుల కాన్పులు 61 శాతం నుంచి 97.3 శాతానికి పెరిగాయి. ప్రసవానంతర సంరక్షణ నమోదు 61 శాతం నుంచి 80.5 శాతానికి పెరిగాయి. ఈ కార్యక్రమంలో సాయుధ దళాలు, పారామిలటరీ, ఢిల్లీ పోలీసు మహిళా అధికారులు, యూనిసెఫ్​, యూఎన్​ ఉమెన్​ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొంటారు. ఈ వార్షికోత్సవాలు జనవరి 22 నుంచి మార్చి 8 వరకు జరుగుతాయి. మార్చి8న మహిళ దినోత్సవం రోజున ముగింపు కార్యక్రమాన్ని చేపడతారు.