గాల్వాన్​ చర్యలు మేల్కొలుపు

డిఫెన్స్​ కాన్​ క్లేవ్​ లో ఆర్మీ చీఫ్​ ఉపేంద్ర ద్వివేది త్వరలో భారత్​–చైనా రెండో దశ రీ బ్యాలెన్సింగ్​ చర్చలు సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నాం దేశభద్రతపై రాజీపడబోం

Sep 20, 2024 - 12:53
 0
గాల్వాన్​ చర్యలు మేల్కొలుపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: లడఖ్​ లోని గాల్వాన్​ వ్యాలీలో చైనా చొరబాట్లు భారత్​ ను మేల్కొలిపాయని ఆర్మీచీఫ్​ ఉపేంద్ర ద్వివేదిక తెలిపారు. శుక్రవారం జరిగిన భారత్ శక్తి డిఫెన్స్ కాన్‌క్లేవ్‌లో ఉపేంద్ర ద్వివేది భారత్​–చైనా సంబంధాలపై కీలక విషయాలను వెల్లడించారు. ఇరుదేశాల మధ్య రీ బ్యాలెన్సింగ్​ చర్చల సందర్భంగా 75 శాతం సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయన్నారు. 2020 తరువాత మరోమరు చైనాతో రీబ్యాలెన్సింగ్​ చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభ తొలగిపోతుందని ఆశాభావం వ్యకతం చేశారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు, భౌగోళిక అంశాలే చర్చల్లో కీలకంగా ఉండనున్నాయని స్పష్టం చేశారు. అనేక వివాదాలపై ఇరుదేశాలు చర్చల వల్ల వెనక్కి తగ్గాయన్నారు. సరిహద్దు, భౌగోళిక సమస్యలు పూర్తి అయినట్లు కాదని వీటిపై ఇరుదేశాల మధ్య మరిన్ని చర్చలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో రెండోదశ రీ బ్యాలెన్సింగ్​ చర్చలకు కేంద్రం చర్యలు చేపడుతుందని ద్వివేది పేర్కొన్నారు. సరిహద్దులో చిన్న ఘటన కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెంచుతోందన్నారు. అందుకే ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అదే సమయంలో దేశ భద్రతపై రాజీ పడబోమన్నారు. ఉద్రిక్తతలకు తావిచ్చే చర్యలకు పాల్పడబోమని ఆర్మీ చీఫ్​ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.