హిందూ పేర్లతో హోటళ్ల నిర్వహణ 27 లైసెన్సులు రద్దు చేసిన జీఎస్ఆర్టీసీ
GSRTC has canceled 27 licenses for operating hotels with Hindu names
గాంధీనగర్: హిందూ పేర్లతో అక్రమంగా ముస్లింలు నడిపిస్తున్న 27 హోటళ్లపై గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (జీఎస్ఆర్టీసీ) కొరడా ఝళిపించింది. గురువారం ఆ హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తూ జీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ హోటళ్లలో ఇక జీఎస్ ఆర్టీసీ బస్సులు ఆగవని స్పష్టం చేసింది. అక్రమమార్గంలో పేర్లను వాడుకుంటూ వ్యాపారాలు నిర్వహించే వారి షాపుల వద్ద బస్సులను ఆపొద్దని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అహ్మాదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్, గోద్రా తదతర ప్రాంతాల్లో ఈ హోటళ్లు ఉన్నాయి. తులసీ, మారుతి, విశాల్, సతీమాత లాంటి కొన్ని హిందూ పేర్లతో ముస్లింలు హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.