వ్యూహాత్మక భాగస్వామ్యాలపై ఒప్పందాలు
Agreements on strategic partnerships

భారత్ – ఖతార్ బంధాలు మరింత బలోపేతం
మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి చర్చలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–ఖతార్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా మరిన్ని అడుగులు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ఖతార్ ఏమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని స్వాగతించారు. అనంతరం మధ్యాహ్నం ఇరుదేశాల విదేశాంగ శాఖ మంత్రులు షేక్ తమీమ్ తో జరిగిన ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీ నేతృత్వంలో హైదరాబాద్ హౌస్ లో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజల సంబంధాలపై వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెంచేదిశగా పలు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరుదేశాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. అనంతరం జరిగిన పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తూ పత్రాలను మార్పిడి చేసుకున్నారు. భారత్–ఖతార్ మధ్య స్నేహం, నమ్మకం, పరస్పర గౌరవం అనే లోతైన చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, సంస్కృతి, ప్రజల నుంచి ప్రజల సంబంధాలతో సహా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయని విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ఒప్పందాల్లో ఇరుదేశాల్లోని ద్వంద్వ పన్నులు, ఆదాయపు పన్నులకు సంబంధించి సవరించిన ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ ఒప్పందాన్ని ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ ఖతార్ ప్రధానమంత్రి లో ఒప్పందాలపై సంతకం చేసినట్లు వివరించారు. ప్రధాని మోదీ 2024లో ఖతార్ పర్యటన సందర్భంగా సాంకేతికత,పెట్టుబడి, ఇంధనం, వాణిజ్యం వంటి వ్యూహాత్మక అంశాలపై సుధీర్ఘ చర్చలు జరిగాయని, అప్పటి చర్చలకు నేడు ఒప్పందాలు కుదిరాయి.
రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఖతార్ ఏమిర్, మంత్రివర్గానికి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్మూ, ఇరుదేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.