నిధులు తీసుకుంటారు.. నిబంధనలు పాటించరా

Funds are taken.. Don't follow the rules

Dec 23, 2024 - 18:05
 0
నిధులు తీసుకుంటారు.. నిబంధనలు పాటించరా

ఉగ్రవాదులు, బంగ్లాదేశ్​ ను బలోపేతం చేస్తారా?
మమత సర్కార్​ పై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర మండిపాటు

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను మాత్రం తీసుకుంటూనే నిబంధనలు పాటించడంలో మాత్రం తిలోదకాలు ఎందుకిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్​ టీఎంసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, బంగ్లాదేశ్​ ను బలోపేతం చేసే విధానాలతో పూర్తి భారతదేశాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఈ రాష్ర్ట ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వ నిర్ణయాలు140 కోట్ల మంది జీవితాలను ప్రమాదంలో పడవేస్తున్నాయన్నారు. బుజ్జగింపు, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ర్టాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. మమత సర్కార్​ తీసుకున్న ఈ అనైతిక చర్యల వల్ల దేశ భవితవ్యమే ప్రమాదంలో పడిందన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్​ లోని ఉగ్రవాదులు భారత్​ కే హెచ్చరికలు జారీ చేస్తున్నా మమత ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని అగ్నిమిత్ర పాల్​ ఆరోపించారు.