ఇస్లామిక్​ నాటో ఏర్పాటు?

Formation of Islamic NATO?

Oct 30, 2024 - 14:15
 0
ఇస్లామిక్​ నాటో ఏర్పాటు?
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్​ తీవ్ర ప్రయత్నాలు
బ్రిక్స్​ లో సభ్యత్వం నిరాకరణతో పెరిగిన అసహనం
ఖలీఫాగా ఎదగాలనే ఆలోచన!
ఈ కూటమితో ప్రపంచదేశాలకు ప్రమాదకరమా?
మధ్యప్రాచ్యం యుద్ధరంగమేనా?
భారీగా పెరగనున్న చమురు ధరలు?
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బ్రిక్స్​ సదస్సులో టర్కీకి సభ్యత్వం లభించకపోవడంతో అన్ని ఇస్లామిక్​ దేశాలతో కలిసి నాటోను ఏర్పాటు చేయాలనే యోచనలో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్​ ఉన్నాడు. 25 ఇస్లామిక్​ దేశాలతో కలిపి నాటో కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలను ఇప్పటికే జోరుగా మొదలు పెట్టాడు. ఇస్లామిక్​ దేశాలు విబేధాలు పక్కన పెట్టి ఈ కూటమిలో చేరితే ఇస్లామిక్​ దేశాల బలం పెరుగుతుందని నచ్చ జెబుతున్నాడు. తద్వారా ఐక్యతారాగంతోపాటు ఈ దేశాలను ఒకేతాటిపైకి తెచ్చి తాను ఖలీఫాలా ఎదగాలని ఉవ్విళూరుతున్నాడు. 
 
ఏది ఏమైనా ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్​ లో ఈ దేశాల కూటమి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం లేకపోలేదనే వాదనలూ వినబడుతున్నాయి. ఇప్పటికే పలు ఇస్లామిక్​ దేశాలపై ఉగ్రవాద ముద్రపడింది. ఒకవేళ అలాంటి దేశాలు ఈ కూటమిలో చేరితో ప్రపంచశాంతికి, వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్​, గాజా, లెబనాన్​ లపై ఇజ్రాయెల్​ చేస్తున్న దాడిని తొలుత నుంచి ఎర్డోగన్​ వ్యతిరేకిస్తున్నాడు. ఇరాన్​ కు తన పూర్తి మద్ధతు ప్రకటించాడు. 
 
ఈ దేశాలు ఏకమైతే మధ్య ప్రాచ్యం యుద్ధరంగంగా మారే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దేశాల గుండా ప్రస్తుతం సరఫరా అవుతున్న చమురు, ఇతర వస్తువుల ధరలు ఆకాశన్నంటే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కూటమికి ఇస్లామిక్​ నాటో, ముస్లిం నాటో, ముస్లిం మిలిటరీ అలయన్స్​ ఆర్గనైజేషన్​ అని నామకరణం చేయాలని నిర్ణయించారు. ఈ కూటమిలో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ), జోర్డాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మలేషియా వంటి పది పెద్ద ముస్లిం మెజారిటీ దేశాల ద్వారా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఇవే గాక ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఒమన్, ఖతార్, కువైట్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియాల, అజర్‌బైజాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, బ్రూనైలు ఇస్లామిక్​ నాటోలో సభ్యదేశాలుగా ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎర్డోగన్​ భావించినట్లు ఈ దేశాలన్నింటితో కూటమి ఏర్పాటైతే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెండో కూటమిగా మారనుంది.
 
గతంలో కూడా ఇలాంటి కూటములను ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేసినా ఆ కూటమిలో నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరలేదు. ప్రస్తుతం కూడా ఈ కూటమి ఉన్నప్పటికీ నామ్​ కే వాస్తేగానే ఉంది. ఈ కూటమి ప్రధానంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇస్లామిక్​ దేశాలు ఏర్పాటు చేసుకున్నది కావడం గమనార్హం. 
 
అయితే ఎర్డోగన్​ కూటమి ఏర్పాటుకు భారత్​, చైనా, అమెరికాలు బ్రిక్స్​ సమావేశంలో టర్కీకి సభ్యత్వం ఇవ్వకపోవడమేనని తెలుస్తుంది. అదే సమయంలో అత్యధిక ఇస్లామిక్ దేశాల్లో యూఎస్​ తన మిలట్రీ క్యాంపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇస్లామిక్​ దేశాలపై నిరంతరం గూడఛర్యం కొనసాగిస్తుందన్న ఆరోపణలున్నాయి.