పాక్ లో ఉగ్రదాడి.. ఐదుగురు మృతి
Five killed in terrorist attack in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని ఖైబర్ ఫంక్తుక్వా ప్రావిన్స్ లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు జవాన్లు సహా ఒక పౌరుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం పెషావర్ లోని దక్షిణ వజీరిస్థాన్ సరిహద్దు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ దాడి జరిగినట్లు పాక్ పోలీసులు తెలిపారు. మిలటరీ ట్రక్కును ఉగ్రవాదులు దొంగతనం చేశారు. ఈ వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పారామిలటరీ బలగాలు ప్రయత్నించి దాడికి గురైనట్లు వివరించారు. దాడిలో ఒక సాధారణ పౌరుడు కూడా మరణించినట్లు తెలిపారు. ఖైబర్ ఫంక్తుక్వాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు పాక్ పెద్ద ఎత్తున ఆపరేషన్ ను చేపట్టింది. శనివారం వరకూ నిర్వహించిన ఆపరేషన్ లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు అలర్టయ్యారు. సైన్యం నుంచి తప్పించుకుంటూ దాడులకు తెగబడుతున్నారు.