వీహెచ్ పీ నేతపై కాల్పులు
అడ్డుకున్న కుమారుడిపై కాల్పులకు తెగబడ్డ నిందితుడు

లక్నో: యూపీలోని సుల్తాన్ పూర్ లో విశ్వహిందూ పరిషత్ నాయకుడు, ఆయన కుమారుడిపై కాల్పులు జరిగాయి. ఆదివారం జరిగిన ఈ దాడి వివరాలను పోలీసులు వెల్లడించారు. దాడి ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. సుల్తాన్ పూర్ లోని కడిపూర్ కొత్వాలి ప్రాంతంలో కత్సరి గ్రామానికి చెందిన వీహెచ్ పీ నాయకుడు సత్యేంద్ర మిశ్రా (48)పై పొరుగునే ఉన్న వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తన కుమారుడు హృతిక్ అ చర్యను అడ్డుకునేందుకు రాగా, నిందితుడు అతడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసి తండ్రి, కుమారులను ఆసుపత్రికి తరలించారు. కాల్పులఘటనపై కడిపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు చర్యలు తీసుకున్నారు.