స్టార్టప్​ నిధుల సేకరణలో బెంగళూరు ముందంజ

Bangalore is at the forefront of startup fundraising

Feb 2, 2025 - 18:33
 0
స్టార్టప్​ నిధుల సేకరణలో బెంగళూరు ముందంజ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతీయ స్టార్టప్​ లలో నిధుల సమీకరణలో బెంగళూరు ముందువరుసలో ఉంది. 30 భారతీయ స్టార్టప్​ లు 240.85 మిలియన్​ డాలర్ల నిధులను పొందాయి. ఈ వారంలో స్టార్టప్​ లకు సంబంధించి 12 ఒప్పందాలు జరిగినట్లు కేంద్ర సాంకేతిక శాఖ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. నిధులను సమీకరించిన స్టార్టప్​ లలో బెంగళూరుతోపాటు ఢిల్లీ ఎన్​ సీఆర్​, ముంబాయి, చెన్నై, పాట్నాలకు చెందినవి ఉన్నాయని పేర్కొన్నారు. ఇకామర్స్​ స్టార్టప్​ లు అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్నాయి. వీటితోపాటు ఫుడ్​ టెక్​, హెల్త్​ టెక్​, తయారీ రంగాల సంస్థలు కూడా పెట్టుబడులను ఆకర్షించాయని చెప్పారు. ఎస్​ ఎఎఎస్​ ఐటీ సూపర్​ ఓపీఎస్​ 25 మిలియన్​ డాలర్లు, ఈడుటెక్​ 65 మిలియన్​ డాలర్లు, బీ2బీ సీఫ/డ్​ 30 మిలియన్​ డాలర్లు, మిరాబిల్లిస్​ ఇన్వెస్ట్​ మెంట్​ ట్రస్ట్​ 12 మిలియన్ల డాలర్ల నిధులను అందుకున్నాయి. 20 సంస్థలకు 107.15 మిలియన్ల డాలర్లు సేకరించాయి.