హిమాచల్, లోయలో 5.3 తీవ్రతతో భూకంపం

హిమాచల్​ప్రదేశ్, కశ్మీర్​ లోయలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది.

Apr 5, 2024 - 16:02
 0
హిమాచల్, లోయలో 5.3 తీవ్రతతో భూకంపం

షిమ్లా: హిమాచల్​ప్రదేశ్, కశ్మీర్​ లోయలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది. ఈ కంపనాలు గురువారం రాత్రికి వచ్చాయని వివరించింది. కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేసింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు పేర్కొంది. 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది.  ప్రకంపనలకు భయపడి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు రాత్రంతా భయంతో జాగారం చేశారు. ఇటీవలే తైవాన్​లో భారీ భూకంపం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా హిమాలయ ప్రాంతాల్లో టెక్టానిక్స్​ ప్లేట్​ల్లో కదలికలు సహజమేనని, ఈ ప్రాంతాలు రెడ్​జోన్​ కిందకు వస్తాయని శాస్ర్తవేత్తలు గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.