ఢిల్లీ కొకైన్​ కేసు ఈడీ విచారణ

ఎఫ్​ఐఆర్​ అందజేత బసోయాపై లుక్​ ఔట్​ నోటీసులు జారీ

Oct 5, 2024 - 17:13
 0
ఢిల్లీ కొకైన్​ కేసు ఈడీ విచారణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భారీ ఎత్తున పట్టుబడిన కొకైన్​ కేసును ఈడీ విచారించనుంది. ఈ మేరకు అభియోగపత్రాలను, ఎఫ్​ ఐఆర్​ను స్పెషల్​ బ్రాంచ్​ పోలీసులు ఈడీకి శనివారం అందజేశారు. మనీలాండరింగ్​ కింద కేసును నమోదు చేసే అంశాలను ఈడీ పరిశీలిస్తోంది. రూ. 5600 కోట్ల విలువైన వ్యవహారం కావడంతో ఈడీ ఎంటరైంది. వీరేంద్ర బసోయా, అతని కుమారుడు, మరికొందరిపై ఢిల్లీ పోలీసులు లుకౌట్​ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సిండికేట్​ తో సంబంధం ఉన్న జితేంద్రసింగ్​ ను యూకె నుంచి ఢిల్లీకి బసోయా పంపించినట్లు విచారణలో గుర్తించారు. ఆ తరువాత తుషార్​, జితేంద్రలు పంచశీలలోని ఓ హోటల్​ లో ఉన్నారు. అనంతరం ఘజియాబాద్​, హాపూర్​ కు చేరుకున్నారు. విచారణలో భాగంగా నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు తెలిపారు.