రాహుల్​, ఓవైసీలకు కోర్టు సమన్లు

జనవరి 18, 19న హాజరు కావాలి వివాదాస్పద వ్యాఖ్యలే కారణం

Jan 7, 2025 - 17:14
 0
రాహుల్​, ఓవైసీలకు కోర్టు సమన్లు

లక్నో: ఎంపీలు రాహుల్​ గాంధీ, అసదుద్దీన్​ ఓవైసీకి బరేలీ కోర్టు రెండోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 18న రాహుల్​, 19న ఓవైసీ కోర్టు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. మంగళవారం ఇరువురి వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. సమన్లు జారీ చేసిన బరేలీ కోర్టు దాఖలైన రివిజన్​ పిటిషన్లను అదనపు సెషన్స్​ జడ్జికి బదిలీ చేశారు. లోక్​ సభ ఎన్నికల సందర్భంగా రాహుల్​ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అఖిల భారత హిందూ మహాసభ డివిజన్​ అధ్యక్షుడు పంకజ్​ పాఠక్​ బరేలీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు పిటిషన్​ ను తిరస్కరించగా, బరేలీ కోర్టు పిటిషన్​ ను విచారణకు అంగీకరించింది. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ పార్లమెంట్​ లో జై పాలస్తీనా నినాదంపై వీరంద్ర గుప్తా అనే న్యాయవాది పిటిషన్​ ను దాఖలు చేశారు. జనవరి 7న ఎంపీ అసద్​ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన తరఫు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో రెండోసారి కోర్టు ఓవైసీకి 19న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.