గ్యాంగ్​ స్టర్​ అమన్​ ఎన్​ కౌంటర్​

ఎన్టీపీసీ ఉన్నతాధికారి హత్య సుపారి ఇతని పనే?

Mar 11, 2025 - 11:38
 0
గ్యాంగ్​ స్టర్​ అమన్​ ఎన్​ కౌంటర్​

రాంచీ: ఎన్టీపీసీ ఉన్నతాధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గ్యాంగ్​ స్టర్​ అమన్​ సాహు ఎన్​ కౌంటర్​ అయ్యాడు. మంగళవారం ఉదయం చత్తీస్​ గఢ్​ లోని రాయ్​ పూర్​ జైలు నుంచి ఝార్ఖండ్​ లోని రాంచీ జైలుకు తరలిస్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించడమే గాక పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఒక జవాన్​ కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అమన్​ ను ఎన్​ కౌంటర్​ చేశారు. ఇతనిపై వందకుపైగా కేసులున్నట్లు అధికారులు వివరించారు. దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్​ లు, హత్యలు, బెదిరింపుల వంటి కేసులున్నాయి. పలు కేసుల్లో శిక్ష పడడంతో రాయ్​ పూర్​ జైలులో శిక్ష అనుభవిస్తూనే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీపీసీ ఉన్నతాధికారి హత్య సుపారి కూడా ఇతనే తీసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారించాలనే రాంచీకి తీసుకువస్తుండగా గ్యాంగ్​ స్టర్​ అమర్​ సాహు తప్పించుకునే క్రమంలో ఎన్​ కౌంటర్​ లో మృతి చెందాడు. కాగా ఎన్​ కౌంటర్​ లో ఝార్ఖండ్​ రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించింది.