పాక్ రాయబారిని వెనక్కు పంపిన అమెరికా!
America sends back Pakistani ambassador!

వాషింగ్టన్: పాక్ కు మరోమారు అమెరికాలో ఘోర అవమానం తప్పలేదు. ఆ దేశ రాయబారి అహ్సాన్ వాగన్ ను లాస్ ఏంజెల్స్ విమానాశ్రయం నుంచే వెనక్కు పంపించివేశారు. రాయబారి పత్రాలు, వీసా అన్ని సరిగ్గానే ఉన్నా ఎందుకు పంపించారనే ప్రశ్నపై పలువురు అమెరికా అధికారులు మాట్లాడుతూ.. రాయబారికి ప్రత్యేక దౌత్యపరమైన పాస్ పోర్టు ఉంటుందన్నారు. సమావేశపరమైన అనుమానాలు ఉండవచ్చని ఈ నేపథ్యంలోనే ఆయన్ను వెనక్కి పంపి ఉంటారని పేర్కొన్నారు. అయితే నిర్దిష్ట సమాచారం తమ వద్ద కూడా లేదన్నారు. కాగా వాగన్ ను వెనక్కు పంపడంపై పాక్ ప్రభుత్వం మండిపడుతుంది. అమెరికాకు నిరసన తెలియజేయాలని భావిస్తుంది. కాగా వాగన్ తుర్కెమెనిస్థాన్ లో పాక్ రాయబారిగా ఉన్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళుతుండగా ఈ చర్య చోటు చేసుకుంది. ఈయన్ను వెనక్కు పంపడంపై దౌత్యపరమైన ఉద్రిక్తతలా? వీసాలో తప్పిదాలా? ట్రంప్ నూతన నియమ నిబంధనల ఎఫెక్టా? అనేది తెలియరాలేదు. ఏది ఏమైనా ఈ చర్య వల్ల అమెరికాకు కించిత్ నష్టం లేకపోయినప్పటికీ అంతర్జాతీయంగా పాక్ పరువు బజారుకీడ్చినట్లయ్యింది.