ఐసీసీ ట్రోఫీ విజయం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అభినందనలు

Prime Minister Modi, Union Minister Kishan Reddy congratulate India on ICC Trophy win

Mar 9, 2025 - 22:13
 0
ఐసీసీ ట్రోఫీ విజయం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అభినందనలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీ–2025లో విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అసాధారణమైన ఆట, అసాధారణ ఫలితమన్నారు. ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫిని ఇంటికి తీసుకువచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉందని తెలిపారు. టోర్నమెంట్ లో మొత్తంలో అద్భుత ఆటతీరును కనబరిచారని కొనియాడారు. అద్భుతమైన సమిష్ఠి ప్రదర్శనతో విజయం సాధించడం పట్ల జట్టుకు, క్రీడాభిమానులకు ప్రధాని నమోదీ అభినందనలు తెలిపారు.

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి..
ఛాంపియన్స్​ ట్రోఫీ కైవసం చేసుకున్న భారతీయ ఆటగాళ్లకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి అభినందించారు. మంచి ప్రదర్శనతో చరిత్ర సృష్టించి సత్తా చాటారని కొనియాడారు. క్రీడాభిమానులందరికీ పెద్ద పండుగలాంటిదన్నారు. బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్, జట్టుకు నాయకత్వం మద్దతుతో విజయం సాధించడం సంతోషకరమన్నారు. టీం ఇండియా విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశం గర్వపడేలా విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి అమిషా..
ఐసీసీ ఛాంపియన్స ట్రోఫీ 2025 అద్భుతమైన విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు. అద్భుతమైన ప్రదర్శన, మైదానంలో తిరుగులేని ఆటతీరుతో ఆధిపత్యం దేశాన్ని గర్వపడేలా చేసింది. క్రికెట్ చరిత్రో అత్యుత్తమ ప్రదర్శనను భారత ఆటగాళ్లు నెలకొల్పారు. ఎల్లవేళలా అద్భుతమైన ప్రదర్శనతో విజయం సాధించాలి. భారత్​ కు ట్రోఫీ అందించిన క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు.

కేంద్రమంత్రి రాజ్​ నాథ్​ సింగ్​..
భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం మంచి ప్రదర్శన కనబరిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది.  ఈ విజయంతో భారతదేశం ఉప్పొంగిపోయింది. క్రికెట్ నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించినందుకు జట్టుకు అభినందనలు. ఈ రోజు ఈ విజయం చాలా మంది యువకులను, ఆశావహులైన క్రికెటర్లను ప్రేరేపిస్తుంది.