రాజ్యాంగమే దేశానికి మార్గదర్శకం

117వ మన్​ కీ బాత్​ లో ప్రధాని మోదీ

Dec 29, 2024 - 15:21
 0
రాజ్యాంగమే దేశానికి మార్గదర్శకం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగమే దేశానికి మార్గదర్శకమని ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక వెబ్​ సైట్​ ను రూపొందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నలను కూడా అడిగే అవకాశాన్ని ప్రతీ ఒక్కరికి కల్పించామన్నారు. ఆదివారం 117వ మన్​ కీ బాత్​ ఎపిసోడ్​ లో ప్రధాని మోదీ భారత సాంస్కృతిక, యువత, పలు వర్గాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, అవకాశాలు, సాంకేతిక అభివృద్ధి, ఐక్యతల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. రాజ్యంగం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందన్నారు. దేశానికంతటికి గర్వకారణమని చెప్పారు. 

ముఖ్యాంశాలు..
జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న ప్రయాగ్​ రాజ్​ మహాకుంభ్​ మేళాను అత్యధిక సంఖ్యలో సందర్శించాలి. ఈసారి ఏర్పాట్లలో హెలికాప్టర్ ద్వారా వీక్షించే ఏర్పాటును ప్రభుత్వ చేసింది. ఈ వేడుకల్లో వివక్షకు తావులేదు. భిన్నత్వలో ఏకత్వంలా ఈ మహాకుంభ్​ మేళా నిర్వహిస్తున్నాం. ఈ మేళా స్పూర్తితో భారత ఐక్యతా స్ఫూర్తిని చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజంలో విద్వేష భావాలను పూర్తిగా రూపుమాపేందుకు ప్రతిజ్ఞ చేయాలి. గంగానది ఒడ్డున ఐక్యతను చాటుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈవేడుకల్లో అత్యాధునిక సాంకేతిక ఏఐ వినియోగించనున్నారు. సాంకేతికత ద్వారా మహాకుంభ్​ చరిత్ర, విషయాలు, విశేషాలను ప్రతీ ఒక్కరికి వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న ఈ ఏర్పాట్ల ద్వారా పిల్లల్లో దేశ ఐక్యతను మరింత బలోపేతం చేయనుంది. ఓటీటీ ఫ్లాట్​ ఫారమ్​ లలో కూడా ఈ వేడుకలు ప్రదర్శించనున్నారు. 

సాంకేతికత..
సాంకేతిక ద్వారా యానిమేషన్​ సినిమాలు, సీరియళ్లకు లభిస్తున్న విశేష ఆదరణ దేశ స్మృజనాత్మక పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయనుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుంది. భారత సినీ పరిశ్రమ ఏక్​ భారత్​ శ్రేష్ఠ్​ భారత్​ వైపు పయనిస్తుంది. 2024లో సినీ ప్రపంచం వందవ జయంతి వేడుకలను జరుపుకుంటుంది. సినీ పరిశ్రమలో పనిచేసిన ఎందరో వ్యక్తులు భారతఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. జాతీయ సమైక్యతను చాటారు. ప్రపంచదేశాలకు భారతదేశ చిత్ర పరిశ్రమ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్​ ఐదు ట్రిలియన్​ డాలర్ల దిశగా పయనిస్తుంది. దేశాభివృద్ధిలో చిత్ర పరిశ్రమ కీలక భూమిక పోషిస్తుంది. 

ఆరోగ్యరంగం..
ఆరోగ్య రంగంలో  2015 నుంచి 2023 మధ్య కాలంలో మలేరియా కేసులు, మరణాలు 80 శాతం తగ్గాయి. అసోంలోని తేయాకు తోటలలో పనిచేసేవారికి మలేరియా సోకడం ఆందోళన కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితులో పూర్తిగా మార్పు వచ్చింది. ప్రస్తుతం మలేరియా కేసులు, మరణాలు అక్కడ పూర్తిగా తగ్గాయి. అలాగే హరియాణాలోని మలేరియాను మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అరికట్టగలిగింది. క్యాన్సర్​ చికిత్సలోనూ ఆయుష్మాన్​ భవ పెద్ద పాత్ర పోషిస్తుంది. దీంతో ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందించడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. ప్రజల ఆరోగ్య విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో, నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సందేశాన్నే గాకుండా ఈ సూక్తిని ఆచరణ దిశగా చర్యలు తీసుకుంటుంది. 

క్రీడలు..
క్రీడల్లో భారత సత్తా చాటుతున్నాం. యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నాం. దేశ యువత ఫిట్​ నెస్​ ను తమ దినచర్యలో భాగమవుతుంది. కాశ్మీర్​ లో స్కీయింగ్​, గుజరాత్​ లో గాలిపటాలు, సైక్లింగ్​, కబడ్డీ, కోకో, క్రికెట్​, ఆర్చరీ, బ్యాడ్మింటన్​, ఫుట్​ బాల్​, హాకీ, వెయిట్​ లిఫ్టింగ్​, కరాటే, వాలీబాల్​ తదితర అన్ని క్రీడలకు ప్రాధాన్యనిస్తున్నాం. అదే సమయంలో పలు దేశీయ క్రీడలను ప్రపంచానికి చాటిచెబుతున్నాం. దీంతో భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం, గౌరవం ప్రపంచదేశాల్లో మరింత ఇనుమడిస్తున్నాయి. చెడు అలవాట్ల నుంచి క్రీడల వైపు యువతను మళ్లించి దేశాభివృద్ధికి కారకులు అయ్యేలా వారిని తీర్చిదిద్దుతున్నాం.

విద్యార్థుల ప్రతిభ..
భారత సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగమైన ఆర్ట్​ రంగం ప్రపంచదేశాల్లో ఔరా అనిపించుకునేలా చేశాం. విద్యార్థుల పెయింటింగ్​ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఈ పోటీల్లో నిరుపేద వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం దేశానికి గర్వకారణం. వారందరినీ ప్రధాని మోదీ అభినందించారు. 

భాషలు..
ప్రపంచదేశాల్లో భారత్​ లో మాట్లాడే భాషలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. తమిళ, ఒడిశా, తెలుగు, అసోం, హీందీతోబాటు అనేక భాషలకు ప్రాధాన్యతనిస్తున్నాం. ఫీజీలో తమిళ బోధన కోస ఉపాధ్యాయులను నియమించడం 80 యేళ్లలో ఇదే తొలిసారి. 

2025 శుభాకాంక్షలు..
ప్రధాని నరేంద్ర మోదీ విద్య, ఉపాధి, ఉద్యోగాలు, రక్షణ, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆరోగ్యం, రైతులు, మహిళలు ఇలా అన్ని రకాల విశ్లేషణలతో కూడిన ప్రసంగం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశాన్ని బలోపేతం, ఆర్థికపరంగా ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని దేశవాసులకు ప్రధాని మోదీ వివరించారు. చివరగా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలను దేశ ప్రజలకు తెలిపారు. నూతన సంవత్సరంలో భారత్​ అభివృద్ది నూతన శిఖరాలకు చేరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.