గత స్మృతులు 2024
Past memories 2024
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మరో రెండు రోజుల్లో 2024 దాటిపోనున్నాం. మానవాళి జీవిత ప్రయాణంలో మరో వెలుగురేఖ 2025లోకి అడుగిడనున్నాం. పాతస్మృతులను వెనక్కునెట్టి ఆశల లోకంలోకి అడుగితామన్న ఆశతో ప్రతీఒక్కరూ 2025కు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. గత స్మృతులు కొన్నింటిని ఒకసారి మనం చేసుకుందాం.
కైట్ ఫెస్టివల్ లో అమిత్ షా..
2024 జనవరి 14 గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన ఉత్తరాయణ్ కైట్ ఫెస్టివల్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని గాలింపు చేపట్టారు. అయితే షా గాలిపటాన్ని ఒక బాలుడు కట్ చేయడంతో అతన్ని చూసి అమిత్ షా గ్రేట్ అని తన బొటన వేలిని చూపించాడు. ఈ ఫెస్టివల్లో 55 దేశాలకు చెందిన 153 మంది ఉన్నారు.
కొలువైన శ్రీరాముడు..
2024 జనవరి 24 అయోధ్యలో శ్రీరాముడు కొలువయ్యాడు. ప్రధాని మోదీ విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి 2020 ఆగస్ట్ 5న భూమి పూజ జరిగింది. అంచనా వ్యయం రూ. 1800 కోట్లు.
శ్రీరాముడికి సూర్య తిలకం..
2024 ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా అభిజిత్ ముహుర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు నేరుగా శ్రీరాముని నుదుటిపై తిలకాన్ని ధరింప చేశాయి. 65 అడుగుల దూరం నుంచి 20 పైసల నాణెం అంత సైజులు ఉన్న తిలకాన్ని 4 లెన్సులు, 4 ప్రత్యేక అద్దాల సహాయంతో నేరుగా శ్రీరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడేలా శాస్ర్తవేత్తలు ఏర్పాటు చేశారు. ఈ దృశ్యం దేశంలోని భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
టీ–20 ప్రపంచకప్..
2024 29 జూన్ బార్బడోస్ లో జరిగిన టీ–20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది. అనంతరం మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ భారత పతాకాన్ని మైదానంలో నాటాడు. ఈ విజయం తరువాత టీ-20లకు శర్మ, కోహ్లీ, జడేజాలు రిటైర్మెంట్ లు ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్..
2025 జూలై 29న పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో హరియాణాకు చెందిన మనుభాకర్ (22) రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. దీనితో ఒలింపిక్స్ లో భారత్ ఖాతా తెరిచింది. భారత్ తరపున షూటింగ్లో పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా మను ఎంపిక.
వయోనాడ్ వరదలు..
2024 జూలై 30న వయోనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రకృతి సృష్టించిన ఈ ప్రకోపంలో 400మందికి పైగా ఉత్పత్తిగా, గ్రామాలు పూర్తిగా బురదలో కూరుకుపోయి, కొట్టుకుపోయాయి. కొండప్రాంతాల్లో మైనింగ్ చేపట్టడమే ఈ ప్రకృతి ప్రకోపానికి కారణంగా వాతావరణ శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు. ఈ వరదల్లో ఓ బాధితురాలురాలిని రెస్క్యూ చేసినప్పటిదే ఈ దృశ్యం.
యోగి ఆదిత్యనాథ్..
భారత్ లోనే ద డేరింగ్ ద డాషింగ్ (బుల్డోజర్ ) సీఎంగా గుర్తింపు పొందే ప్రతి ఒక్కరూ యోగి ఆదిత్యనాథ్. తన బుల్డోజర్ తీర్పులతో యూపీలోని మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించి వేశారు. 2024 సెప్టెంబర్ 3న సాయుధ ప్రదర్శన వేడుకల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రదర్శనలో ఉంచిన తుపాకీతో ఇలా గురిపెడుతూ కెమెరాకు చిక్కారు. ఈ ఫోటోను చూస్తే ఆయన అభిమానాల్లో హర్షం వ్యక్తం అవుతుండగా, సంవత్సరం చివర్లోనే కాదు.. వచ్చే ఏడాదిలోనూ గ్యాంగ్ స్టర్ లకు వణుకు పుట్టిస్తున్నారు. బుల్ డోజర్ కు స్టాప్ పెడితే బుల్లెట్ తోనే సమాధానం అన్నట్లు ఈ దృశ్యం భయపెడుతుంది. కానీ యోగి ముఖంలో మాత్రం భయమే లేదు!
రతన్ 'టాటా'
2024 అక్టోబర్ 9న టాటా గ్రూప్ చైర్మన్ రతన్ నావల్ టాటా కన్నుమూశారు. వర్లీ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంచలంచెలుగా ఎదుగుతూ వ్యాపార దక్షతలో, సేవా గుణంలోనూ తన నిబద్ధతను చాటుకుంటూ ప్రపంచంలో తనదైన ముద్రను వేసిన రతన్ 'టాటా' (వీడ్కోలు) చెప్పారు.
మోదీపై లంబోదరుడి ఆశీస్సులు..
2024 సెప్టెంబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీజేఐ డీవై చంద్రచూడ్ ఇంటికి చేరుకొని మహారాష్ర్ట వేషధారణలో వినాయకుడికి ఆరతి సమర్పించారు. ఈ చిత్రంలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌తోపాటు ఆయన భార్య కల్పనా చంద్రచూడ్ కూడా నటించింది. ప్రధాని పూజలో పాల్గొనడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. దీనితో హస్తం, కమలం ఢీ అంటే ఢీ అనే రీతిలో ఒకరిపై మరొకరు ఆరోపణలు అస్ర్తాలు సంధించారు. ప్రధాని మోదీ మాత్రం లంబోదరుడి ఆశీస్సులు పొంది సైలెంట్‌గా తన పనులకు ఉపక్రమించారు.
మణిపూర్ శాంతికి కేంద్రం చర్యలు వేగవంతం..
2024 నవంబర్ 16న ఇంఫాల్‌లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించిన సంఘీభావ యాత్ర సందర్భంగా నిరసనకారులు పలుచోట్ల వాహనాలను దగ్ధం చేశారు. మణిపూర్‌లో ఏడాది క్రితం ప్రారంభమైన మొయిటీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు క్రమేణా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లి దేశంలోని ప్రాంతాలు, వర్గాలు, మతాలకు మధ్య వైషమ్యాల్లో చిచ్చురేపుతున్నాయి. దీనికి విదేశాల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ మణిపూర్ సరిహద్దులో ఏకంగా లక్ష మంది సైనికులతో భారీ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియను సరిహద్దులో వేగవంతం చేసింది.
పుష్ప–2 రికార్డులు, కేసులు..
ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 – 2024 నవంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో రికార్డులను బద్ధలు కొట్టింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఒకరోజు ముందు నిర్వహించిన ప్రీమియర్ షో సందర్భంగా వచ్చిన అభిమానుల సందడిలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. దీంతో పుష్ప–2 హీరో అల్లుపై ఆరోపణలు, విమర్శలు, కేసులు చుట్టుముట్టాయి. క్రమేణా ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఈ సినిమా సంక్రాంతి వరకూ కూడా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుందని సినీ విశ్లేషకులు.
మహాకుంభ్ కు ప్రయాగ్ రాజ్ ముస్తాబు..
2025 జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభ్ ప్రారంభించబడింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఈసారి 50 కోట్ల మంది వరకు వస్తారని. ఈ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకాన్ని వీడిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్..
2024 డిసెంబర్ 26న మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (92) లోకాన్ని వీడి వెళ్లారు. ఉత్తర భారతదేశం నుంచి ప్రధానిగా ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పలు నిర్ణయాల్లో సోనియాగాంధీని కూడా విభేదించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈయన స్మారక, సమాధి వివాదం ప్రస్తుతం రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హాట్ టాపిక్ గా మారింది.