ఉత్పత్తిలో 4.3 శాతం వృద్ధి
4.3 percent growth in production
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దేశంలో ప్రధాన పరిశ్రమ రంగాలు ఉత్పత్తిలో 2024 నవంబర్ వరకు 4.3 శాతం వృద్ధిని సాధించాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సిమెంట్, ఉక్కు, బొగ్గు లాంటి పరిశ్రమలు వృద్ధిలో ప్రథమ వరుసలో ఉన్నాయి. నవంబర్ లో సిమెంట్ ఉత్పత్తి 13 శాతం వృద్ధి చెందగా, ఉక్కు 4.8 శాతంగా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తిలో 3.8 శాతం పెరుగుదల నమోదైంది. ఎరువుల ఉత్పత్తి 2 శాతం పెరగగా, బొగ్గు ఉత్పత్తి 7.5 శాతం పెరిగింది. రిఫైనరీ ఉత్పత్తి 2.9 శాతం పెరుగుదల నమోదైంది. ఎనిమిది పరిశ్రమల ఉత్పత్తి 40.27 శాతం పెరుగుదల నమోదైనట్లు ఇక్రా (ఐసీఆర్ ఎ) చీఫ్ అదితి నాయర్ పేర్కొన్నారు. కోర్ సెక్టార్ వృద్ధి రేటు అక్టోబర్ 2024లో సవరించిన 3.7 శాతం నుంచి నవంబర్ 2024లో 4.3 శాతానికి పెరిగింది.