అపూర్వం ఆత్మీయ సమ్మేళనం

An unprecedented spiritual union

Jun 8, 2024 - 18:04
 0
అపూర్వం ఆత్మీయ సమ్మేళనం

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. 1998-99 సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారంతా ఒక్కచోట కలుసుకునేందుకు చిన్ననాడు చదువుకున్న రామకృష్ణాపూర్ సింగరేణి ఉన్నత పాఠశాల వేదికైంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు కూడా  తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటాపాటలతో సరదాగా గడిపారు. చిన్ననాటి చిలిపి పనులు, మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ప్రస్తుతం వారు స్థిరపడ్డ రంగాలు, అనుభవాలను మిత్రులతో పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కనుకుట్ల కుమార్, తిరుపతి, శంకర్, రాజమొలి, అరుణ, వీణ, కవిత, రాణి, శ్రీలత తదితరులు ఉన్నారు.