సంభాల్ బయటి గోడలకు రంగులు
Colors for the outer walls of Sambhal

చారిత్రక ఆనవాళ్లకు నష్టం కలిగించొద్దు
ఎస్ఎస్ఐ పై హైకోర్టు ఆగ్రహం
లక్నో: సంభాల్ జామా మసీదు బయటి గోడలకు రంగులద్దుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు బుధవారం అనుమతినిచ్చింది. అదేసమయంలో ఎఎస్ ఐ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ముస్లిం తరఫు పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆనవాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా లోపలి వైపు గాకుండా బయటివైపు రంగులు వేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా ప్రభుత్వ తరఫు న్యాయవాది మనోజ్ కుమార్ సింగ్ వాదిస్తూ చాలాఏళ్లుగా మసీదు గోడలకు సున్నం వేస్తూ చారిత్రక ఆనవాళ్లను మాయం చేశారని, గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆనవాళ్లు కోల్పోయామని వాదించారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ ఇన్నేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. బయటి గోడలకు మాత్రమే రంగులు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నామని, పిటిషన్ ను ఇంతటితో ఈ అంశంపై విచారణను నిలిపివేస్తున్నట్లు హైకోర్టుస్పష్టం చేసింది.
10న విచారణ సందర్భంగా ఎఎస్ఐ నుంచి సుప్రీం అఫిడవిట్ కోరింది.