క్లౌడ్​ స్కామ్​ నిందితుల అరెస్ట్​

Cloud scam accused arrested

Mar 2, 2025 - 12:25
 0
క్లౌడ్​ స్కామ్​ నిందితుల అరెస్ట్​

చండీగఢ్​: క్లౌడ్​ పార్టికల్​ రూ. 3558 భారీ స్కామ్​ కు పాల్పడ్డ నిందితులను ఈడీ (ఎన్​ ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్​)​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి పారిపోవాలని ప్లాన్​ వేసిన ఇందరు నిందితులను ఢిల్లీ విమానాశ్రయంలో చాకచక్యంగా ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సేల్​ అండ్​ లీడ్​ బ్యాంక్​ అనే విధానం ద్వారా పంజాబ్​ కు చెందిన సుఖ్వీందర్​ సింగ్​ ఖరూర్​, డింపుల్​ ఖరూర్​ లను అరెస్టు చేశారు.  ఈ మోసాన్ని గుర్తించిన పోలీసులు పెట్టుబడిదారుల ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం భారీ మోసం జరిగినట్లు, పెట్టుబడిదారుల ఒత్తిడి వల్ల ఈడీ రంగంలోకి దిగింది. దీంతో వీరు పాల్పడిన మోసం చిట్టా పూర్తిగా బయటకు వచ్చింది. క్లౌడ్ పార్టికల్ టెక్నాలజీ పేరుతో స్థాపించిన సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఆ పెట్టుబడులకు భారీ వడ్డీ చెల్లిస్తామని ప్రకటనలు, ఏజెంట్ను నియమించుకొని స్కామ్​ కు తెరలేపారు. ప్రస్తుతం వీరిద్దరిని ఈడీ మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించింది.