మార్చి 3 నుంచి మహా బడ్జెట్ సమావేశాలు
Grand Budget meetings from March 3

ముంబాయి: మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. శాసనసభ సమావేశాల నిర్వహణపై సలహా కమిటీ సమావేశం విధాన భవన్ లో కొనసాగింది. శాసనమండలి చైర్మన్ రామ్ షిండే, స్పీకర్ రాహుల్ నర్వేకర్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి చంద్రకాంత్ పాటిల్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మహారాష్ర్టలో సభా కార్యక్రమాల నిర్వహణ, కేటాయింపులు, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే పలు అంశాలపై అంతర్గతంగా చర్చించారు. కర్ణాటక సరిహద్దు వివాదం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రతిపక్షాలను నిరోధిస్తూనే ఏ విధంగా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది.