కాంగ్రెస్​కు బిగ్​ షాక్​ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక

హిమాచల్ ​రాజకీయాల్లో హస్తానికి ఝలక్​

Mar 23, 2024 - 16:40
 0
కాంగ్రెస్​కు బిగ్​ షాక్​ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక

సిమ్లా: హిమాచల్​ప్రదేశ్​లో కాంగ్రెస్​కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు.  శనివారం హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో సుధీర్ శర్మ, రవి ఠాకూర్, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవేంద్ర భుట్టో, చైతన్య శర్మలు బీజేపీలో చేరారు. వీరే గాక మరో రెండు రోజుల్లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారమే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ను వీడారు. సిమ్లాలో విపిన్​ సింగ్​ పర్మార్​ అధ్యక్షతన బీజేపీ లెజిస్లేచర్​ పార్టీ సమావేశంలో సత్పాల్ సత్తి, రణధీర్ శర్మ, హన్స్ రాజ్, ప్రకాష్ రాణా, పవన్ కాజల్, సురేంద్ర శౌరీ, దిలీప్ ఠాకూర్, దీప్రాజ్, రణ్‌వీర్ నిక్కా, వినోద్ కుమార్, బల్వీర్ వర్మ, ఇంద్రసింగ్ గాంధీ, రీనా కశ్యప్, పూర్ణ చంద్, జనక్ రాజ్, లోకీంద్ర కుమార్, బి.జె.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిహారీ లాల్ శర్మ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై కూలంకషంగా చర్చించినట్లు ఎమ్మెల్యే రణధీర్ శర్మ తెలిపారు.