ఢిల్లీని మోసం చేసిన ఛోటే మియా, బడే మియా!

ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్​ షా

Feb 3, 2025 - 13:46
 0
ఢిల్లీని మోసం చేసిన ఛోటే మియా, బడే మియా!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ‘ఛోటే మియా, బడే మియా’ (చిన్నోడు, పెద్దోడు)లు ఢిల్లీని మోసం చేసేందుకు ఏ ఒక్క రాయిని వదల్లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా విమర్శించారు. ఢిల్లీలోని ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుండడంతో షా జంగ్​ పూరాలో జరిగిన సభలో మాట్లాడుతూ కేజ్రీవాల్​ పై విరుచుకుపడ్డారు. మద్యం దుకాణాలతో అవినీతిని తెరలేపారన్నారు. యమునా నదిని కూడా శుభ్రం చేయకుండా విషం అంటూ ఇతర రాష్ర్టాలపై అవాకులు, చవాకులు మాట్లాడుతూ ఉద్రిక్తతలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం నీచరాజకీయం ఆప్​ అధినేతకే చెల్లిందన్నారు. గత పదేళ్లలో హామీలను ఎందుకు అమలు చేయలేదని, ఇప్పుడు కొత్త హామీలతో ప్రజల ముందుకు వచ్చారని నిలదీశారు. బీజేపీ యమునా నదిపై రివర్​ ఫ్రంట్​ నిర్మిస్తామని మోదీ ప్రభుత్వం గ్యారంటీ అని హామీ ఇచ్చారు.  బీజేపీ అభ్యర్థి తర్విందర్​ సింగ్​ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈసారి ఆప్​ అనే విపత్తునుంచి ఢిల్లీకి మోక్షం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్​, సిసోడియా లాంటి పెద్ద నేతలు కూడా ఓడిపోనున్నారన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు లాంటి సంక్షేమాలను విస్మరించి, కేంద్ర పథకాలను రానీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.