శీష్​ మహల్​ దర్యాప్తునకు సీవీసీ ఉత్తర్వులు

కేజ్రీవాల్​ కు పెరగనున్న కష్టాలు

Feb 15, 2025 - 11:39
 0
శీష్​ మహల్​ దర్యాప్తునకు సీవీసీ ఉత్తర్వులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ కు కష్టాలు పెరగనున్నాయి. ఆయన నివాసం శీష్​ హహల్​ కేసులో బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాలని సీవీసీ (సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) నివేదిక వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు)లో నిర్మించిన బంగ్లా నిర్మాణంలో అనేక నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని నివేదిక పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ బంగ్లా పునరుద్ధరణకు రూ.45 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఆ ఖర్చు కాస్త నిర్మాణం పూర్తయ్యే నాటికి 90 కోట్లకు పైగా చేరిందనే ఆరోపణలున్నాయి. 

భవన నిర్మాణం, విలాసవంతమైన వస్తువుల ఖర్చుపై విచారణ చేపట్టాలని పేర్కొంది. శీష్​ మహల్​ పై విచారణ చేపట్టాలని విజేంద్ర గుప్తా తోపాటు బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్​ దేవా గవర్నర్​ వీకే సక్సేనాకు కూడా లేఖ రాశారు. నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. ఆక్రమణ నిర్మాణమని వెంటనే నేలమట్టం చేయాలన్నారు. అధికారిక నివాసం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.