ఉగ్రవాదులతో సంబంధం ముగ్గురు ఉద్యోగులు తొలగింపు

Termination of three employees linked to terrorists

Feb 15, 2025 - 11:58
 0
ఉగ్రవాదులతో సంబంధం ముగ్గురు ఉద్యోగులు తొలగింపు

ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్​ మనోజ్​ సిన్హా

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ ఉగ్రవాద సంబంధాల కేసులో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు తొలగిస్తూ లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా జమ్మూకశ్మీర్​ లో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉగ్రవాదులతో దగ్గరి సంబంధాలను కలిగి ఉండడం, ఇక్కడి సమాచారాన్ని వారికి చేరవేయడం, ఉగ్రవాదులకు సహాయం చేయడం లాంటివి చేస్తున్నారు. కానిస్టేబుల్​ ఫిర్దౌస్​ భట్​ లష్కర్​ ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. ప్రస్తుతం ఇతను జైలులో ఉన్నాడు. అనంత్​ నాగ్​ లో ఇద్దరు ఉగ్రవాదులు వసీం షా, అద్నాన్​ బేగ్​ లను భద్రతా దళాలు అరెస్టు చేసి విచారించగా ఇతని పూర్తి పాత్ర వెల్లడైంది. పాక్​ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున రహాస్య సమాచారాన్ని అందజేస్తూ వారికి సహాయం చేస్తున్నట్లు గుర్తించారు. ఇక రెండో ఉద్యోగి అటవీశాఖకు చెందిన నిసార్​ అహ్మద్​. ఇతను హిజ్బుల్​ ముజాహిదీన్​ ఉగ్రవాది. ఈ ఉగ్రవాద సంస్థకు ఇక్కడి కీలక సమాచారం సేకరించి పంపేవాడు. ఆ సమాచారంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేవారు. ఇతని సమాచారంతోనే అనంత్​ నాగ్​ లో ల్యాండ్​ మైన్​ దాడిలో జమ్మూకశ్మీర్​ విద్యుత్​ శాఖ మంత్రి గులాంహసన్​ భట్​ మృతిచెందాడు. ఇతనిపై టాడా చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న రియాసీ నివాసి అష్రఫ్​ భట్​. లష్కరే తోయిబాకు విధేయుడిగా ఉన్నాడు. పలు దాడుల సందర్భంగా ఉగ్రవాదులు ఇచ్చిన కీలక సమాచారం ద్వారా ఆరా తీస్తే ఇతను పాక్​ నివాసి మోస్ట్​ వాంటెడ్​ మొహమ్మద్​ ఖాసిం అని తెలిసింది. ప్రస్తుతం అష్రఫ్​ భట్​ రియాసి జైలులో ఉన్నాడు. వీరంతా జమ్మూకశ్మీర్​ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ ఉగ్రవాదులుగా ముద్రపడి, వారికి సహాయం చేస్తూ దేశ సమగ్రతకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడడంపై ఇటీవలే జమ్మూకశ్మీర్​ ఉన్నతాధికారులతో గవర్నర్​ భేటీలో వీరిని సస్పెండ్​ చేయాలని నిర్ణయించారు. దీంతో గవర్నర్​ శనివారం వీరి సస్పెన్షన్​ ఉత్తర్వులు జారీ చేశారు.