సీఏఏపై సీఎం వ్యాఖ్యలు

భగ్గుమన్న శరణార్థులు.. కేజ్రీవాల్​ ఇంటిముందు ఆందోళన

Mar 14, 2024 - 17:42
 0
సీఏఏపై సీఎం వ్యాఖ్యలు

నా తెలంగాణ, ఢిల్లీ: సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలపై శరణార్థులు భగ్గుమన్నారు. ఆయన నివాసం ఎదుట గురువారం ఉదయం ఒక్కసారిగా ధర్నాకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చట్టంపై కేజ్రీవాల్​ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ వల్ల ఏ విధంగా శాంతిభద్రతలు విచ్ఛిన్నం అయ్యాయో చూపాలని పేర్కొన్నారు. తామేమి దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడడం లేదని దేశ విభజన సమయంలో అక్కడే ఉండిపోయిన తమ పూర్వ తరాలు, తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ దేశానికి తిరిగి వస్తే ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. మీకు ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అయితే మీరు అలాగే అనేవారా? అని నిలదీశారు. భారత్​లో పౌరసత్వం పొందడం తమ జన్మహక్కు అని ఆది నుంచి భారత్​ తమ మాతృభూమేనని చెప్పారు. సీఏఏను అమలు చేసినందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి షా, బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల నరకం నుంచి తమ కుటుంబాలకు విముక్తి కల్పించే అవకాశాన్ని ఇస్తే చూసి రాజకీయ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్, మయన్మార్​ నుంచి వచ్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడడం లేదని శరణార్థులు సీఎం కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.