బ్రిటిష్​ అమ్మాయిపై లైంగికదాడి

British girl sexually assaulted

Mar 13, 2025 - 13:12
 0
బ్రిటిష్​ అమ్మాయిపై లైంగికదాడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో బ్రిటిష్​ బాలికపై లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటన గురువారం వెలుగులోకొచ్చింది. పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోషల్​ మీడియా మాధ్యమంగా పరిచయం అయిన స్నేహితుడిని కలవాలని బ్రిటిష్​ అమ్మాయి భారత్​ న్యూ ఢిల్లీకి చేరుకుంది. ఇద్దరు నిందితులు ఈమెపై లైంగికదాడికి పాల్పడ్డట్టు మంగళవారం ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై బ్రిటిష్​ రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. ఢిల్లీలోని మహిపాల్​ పూర్​ హోటల్​ గదిలో ఈ అమ్మాయిపై లైంగికదాడి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.