అమెరికాకు విద్యుత్​ నిలిపివేస్తాం

డగ్​ ఫోర్డ్​ హెచ్చరిక

Mar 5, 2025 - 15:28
 0
అమెరికాకు విద్యుత్​ నిలిపివేస్తాం

ఒంటారియో: అమెరికాకు విద్యుత్​ సరఫరా నిలిపివేస్తామని కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్​ ప్రీమియర్​ డగ్​ ఫోర్డ్​ హెచ్చరించారు. తమదేశ జల విద్యుత్​ అమెరికాలోని మిన్నెసోటా, మిచిగాన్​, న్యూయార్క్​ లలోని 15 లక్షల ఇళ్లకు అందుతుందన్నారు. అంతేగాకుండా అమెరికాకు నికెల్​ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేస్తామని బెదిరించారు. ఒంటారియో ప్రావిన్స్​ అమెరికా తో సరిహద్దును పంచుకుంది. యూఎస్​ ఎనర్జీ విభాగం వివరాల ప్రకారం 2023లో 38.9 మిలియన్​ మెగావాట్​ ల విద్యుత్​ ను దిగుమతి చేసుకుంది. ఇందులో 33 శాతం కెనడా నుంచి వచ్చింది. కాగా ఈ విద్యుత్​ వినియోగం అమెరికాలో కేవలం 1 శాతం మాత్రమే కావడం గమనార్హం. కెనడా నుంచి అమెరికా రోజుకు 1.4 మిలియన్​ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇది అమెరికా మొత్తం దిగుమతుల్లో సగానికి పైగా ఉంటుంది. కెనడా చమురు సరఫరాను నిలిపివేస్తే అమెరికాపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా ఈ చర్యను తీసుకుంటే కెనడాకు కూడా తీవ్ర నష్టం తప్పదు. దీంతో ఆ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేదు.
ప్రధాని జస్టిన్​ ట్రూడో..
కెనడా ఆర్థిక వ్యవస్థను ట్రంప్​ కుప్పకూల్చాలని ప్రయత్నిస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో ఆరోపించారు. తాను డోనాల్డ్​ ట్రంప్​ తో మాట్లాడతానని ఇరుదేశాల్లోని ఆందోళనకర పరిస్థితులను తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు.