కొత్త ఉద్యోగం కోసమే సీఈసీ రాజీవ్​ కుమార్​ రాజకీయాలు

కేజ్రీవాల్​ అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు

Jan 30, 2025 - 14:13
 0
కొత్త ఉద్యోగం కోసమే సీఈసీ రాజీవ్​ కుమార్​ రాజకీయాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యమునాలో విషంపై వివరణ కోరిన సీఈసీ రాజీవ్​ కుమార్​ పై ఆప్​ అధినేత కేజ్రీవాల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రాజకీయాలు చేస్తుందన్నారు. రాజీవ్​ కుమార్ తన పదవీ విరమణ తరువాత ఉద్యోగం కోసం చూస్తున్నారని అందుకే రాజకీయాలు చేస్తున్నారని గురువారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే ఢిల్లీలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కేజ్రీవాల్​ అన్నార. ఈసీ ఇంతగా దిగజారిందని తాను భావించడం లేదన్నారు. రెండు రోజుల్లో తనను జైల్లో పెడతారని జోస్యం చెప్పారు. వాళ్లు జైల్లో పెట్టినా తాను భయపడేవాడిని కానన్నారు. ఇలాంటి ఎన్నికలను దేశంలో ఎక్కడా, ఎన్నడూ  చూడలేదన్నారు. 

యమునాలో విషం కలిపారన్న వ్యాఖ్యలపై సీఈసీకి హరియాణా సీఎం నాయబ్​ సింగ్​ సైనీ ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు తమను, తమ రాష్​ర్ట ప్రజలను కించపరిచేవిగా, రాజకీయ ప్రేరేపితమైనవిగా భావించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఈసీ నోటీసులు జారీ చేసింది. బదులుగా కేజ్రీవాల్​ సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ యమునాలో విషం ఎక్కడుందో? నమూనాలను ఏ సంస్థలు సేకరించాయో లాంటి వివరాలను ఆధారాలతో సహా అందించాలని గురువారం మరో నోటీసు పంపారు. ఇదే సీఈసీ రాజీవ్​ కుమార్​ పై కేజ్రీవాల్​ ఆగ్రహానికి కారణమైంది.