కేజ్రీ ఇంటిముందు బీజేపీ ఆందోళన
BJP agitation in front of Kejri's house
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పూర్వాంచల్ పై అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కేజ్రీవాల్ ఇంటిఎదుట శుక్రవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఆందోళన, నిరసన చేపట్టారు. ఢిల్లీలోని అశోక రోడ్ నుంచి నిరసనగా బయలుదేరి కేజ్రీవాల్ ఇంటివద్దకు చేరుకున్నారు. పెద్దపెట్టున కేజ్రీవాల్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంటిలోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు నాయకులు, కార్యకర్తలపై వాటర్ కెనన్లు ప్రయోగించారు. లాఠీచార్జీ చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్వాంచల్ ఓట్లపై వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. దీంతో పూర్వాంచల్ ప్రజలను అవమానించారని బీజేపీ మండిపడింది. ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటులో పూర్వాంచల్ కీలక భూమిక పోషిస్తుంది.