అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు
సునీతా విలియమ్స్ సంతోషం

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎట్టకేలకు నాసా క్రూ 10 నలుగురు శాస్ర్తవేత్తలు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. సునీతా విలియమ్స్ వీరిని చూసి భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు. ఎలోన్ మస్క్ కు చెందిన పాల్కన్ 9లో అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ ఐరెస్, జపనీస్ అంతరిక్ష సంస్థకు చెందిన టకుయా ఒనిషి, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నాసా భావించినట్లుగా అంతా సజావుగా కొనసాగింది. ఇక సునీతా విలియమ్స్ మార్చి 19 లేదా 20న అంతరిక్షం వీడి భూమికి చేరుకోనున్నారు. కాగా ఇప్పటికే సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, అనారోగ్యం తదితరాలపై విభిన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండడంతో ఆమె భూమిపైకి వచ్చాక కొన్నిరోజులపాటు పూర్తి వైద్యపర్యవేక్షణలో ఉండనున్నారు.