సతారాలో కమల వికాసమే బీజేపీ అభ్యర్థి ఛత్రపతి ఉదయన్ విజయం ఖాయమే
మహారాష్ర్టలో ఐదు విడతల్లో ఎన్నికలు
ముంబై: మహారాష్ర్టలోని 48 స్థానాలకు గాను ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సతారా ఎంపీ స్థానం రాష్ర్టంలో ముఖ్యమైన స్థానంగా భావిస్తారు. జిల్లా కేంద్రంగా ఉన్నందున ఈ సీటుపై తీవ్ర పోటీ ఉంది. అయితే ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పదమూడో వారసుడు ఉదయన్ రాజే భోంస్లేను రంగంలోకి దింపింది. అయితే ఇదే స్థానం నుంచి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, ఎస్పీ నాయకుడు శశికాంత్ షిండే కూడా గట్టి పోటీ నిచ్చే అవకాశం ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి భోంస్లే గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కూడా ఈయన విజయం సునాయాసమే అనే వాదన వినబడుతోంది. కాగా ఈ స్థానంలో ఓటర్ల సంఖ్య 18,484,89. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 9,451,82, మహిళా ఓటర్ల సంఖ్య 9,032,90. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరిగింది. మే 7, మే 13, మే 20 తేదీల్లో వరుసగా మూడు, నాలుగు, ఐదో దశలకు పోలింగ్ జరగనుంది. సతారాలో మూడో దశ పోలింగ్ మే 7న జరగనుండగా, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను ఎన్డీయే 41 సీట్లు గెలుచుకోగా, యూపీఏ 5 సీట్లు గెలుచుకుంది. మరి 2024 ఎన్నికల్లో ఎవరి జెండా ఎగురుతుందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.