హిమపాత ప్రమాదం.. మేజిస్టీరియల్ విచారణకు ఆదేశం
Avalanche accident.. Order for magisterial inquiry

డెహ్రాడూన్: బ్రదీనాథ్ చమోలీ హిమపాతం ప్రమాదంపై ఆ రాష్ర్ట ప్రభుత్వం మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించింది. మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో జోషిమఠ్ ఎస్టీఎంను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఫిబ్రవరి 28న జరిగిన హిమపాతం ప్రమాదంపై చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ విచారణకు ఆదేశించారు. 54 మంది కార్మికుల్లో 46 మందిని సురక్షితంగా కాపాడారు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తప్పిపోయిన నలుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంతో రెస్క్యూ చర్యలు పూర్తయ్యాయి. కాగా ప్రమాదానికి పూర్తి కారణాలు, భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే ముందే అలర్ట్ జారీ చేయడం లాంటివి, ఇలాంటి చోట్ల పనులు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన నివేదికను విచారణ అనంతరం ఎస్డీఎం ప్రభుత్వానికి, కోర్టుకు సమర్పించనున్నారు.