కాలిఫోర్నియా బాప్స్ ఆలయంపై దాడి!
Attack on California Baps temple!

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలోని మరోసారి హిందూ దేవాలయం బాప్స్ (బోచనసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్)పై దాడి జరిగింది. దాడితోపాటు విద్వేషపు వార్తలు రాశారు.ఈ విషయాన్ని దేవాలయం బోర్డు సోషల్ ఫ్లాట్ ఫామ్ వేదికగా తెలిపింది. ఆలయం విధ్వంసంపై పోలీసులకు సమాచారం అందించామని పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియాలో సమాజం ఐక్యంగా ఉన్నప్పుడు ద్వేషం వేళ్లూనుకోవడం తాము అనుమతించబోమని దేవాలయ బోర్డు పేర్కొంది. ఆలయంపై దాడి అమానుషమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులకు తాము బెదరబోమని మానవత్వం, విశ్వాసం, కరుణ మరింత ప్రబలంగా ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా దేవాలయాలపై ఖలిస్థానీ గ్రూపులు ఆందోళనలకు, దాడులకు తెగబడ్డాయి. కాగా దేవాలయంపై దాడి విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జై స్వాల్ తీవ్రంగా ఖండించారు. విషయంపై ఆరా తీస్తూ ఆ రాష్ర్ట ప్రభుత్వ వర్గాలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.