అతిషి రాజీనామా

Atishi's resignation

Feb 9, 2025 - 12:23
 0
అతిషి రాజీనామా

సెంబ్లీని రద్దు చేస్తూ ఎల్జీ ఉత్తర్వులు జారీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా సమర్పించారు. ఆదివారం ఉదయం 11గంటలకు రాజ్​ భవన్​ కు చేరుకున్న అతిషి లెఫ్ట్​ నెంట్​ గవర్నర్​ వీకే.సక్సేనాకు తన రాజీనామాను సమర్పించారు. రాజీనామా అనంతరం ఎల్జీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్​ జారీ చేశారు. దీంతో నూతన అసెంబ్లీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్త అసెంబ్లీ ఏర్పాటయ్యాక ప్రభుత్వ ప్రక్రియ ప్రారంభమవుతాయి. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే ఎదురుచూపులు నెలకొన్నాయి. మరోవైపు ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా, కేంద్రమంత్రి జేపీ. నడ్డా అధ్యక్షతన ముఖ్యమంత్రి ఎంపికపై ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆశావహ అభ్యర్థులు పలువురు పాల్గొన్నారు. 26 ఏళ్ల తరువాత హస్తినలో కమలం వికసించింది.