మార్చి 19న భూమికి వ్యోమగాములు!

Astronauts to Earth on March 19th!

Mar 15, 2025 - 13:53
 0
మార్చి 19న భూమికి వ్యోమగాములు!

విజయవంతమైన క్రూ 10 ప్రయోగం
9 నెలల తరువాత రానున్న సునీతా, బుచ్​ లు

కెన్నడీ: భారత సంతతికి చెందిన అమెరికన్​ వ్యోమగామి సునీతా విలియమ్స్​ మార్చి 19న తిరిగి రానున్నారు. ఎలోన్​ మస్క్​ కు చెందిన పాల్కన్​ 9ని విజయవంతంగా ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్​ సెంటర్​ నుంచి ప్రయోగించారు. ఇందులో నలుగురు వ్యోమగారులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ మిషన్​ కు ‘క్రూ 10’ అని పేరు పెట్టారు. 8 రోజుల ఐఎస్​ఎస్​ పర్యటనకు వెళ్లిన సునీతా విలియమ్స్​ బుచ్​ విల్మోర్​ లో 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. దీంతో ట్రంప్​ ప్రభుత్వం వీరిని సురక్షితంగా తీసుకురావాలని సంకల్పిస్తూ ఈ పనిని ఎలోన్​ మస్క్​ కు పురమాయించింది. దీంతో ఎలోన్​ మస్క్​ సంస్థ పనులు ప్రారంభించి సునీతా, బుచ్​ లను భూమిపైకి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. పలుమార్లు ఫాల్కన్​ 9 రాకెట్​ ప్రయోగంలో విఫలమైనా చివరకు విజయం సాధించింది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు నాలుగు రోజుల తరువాత భూమిని తిరిగి రానున్నారు. అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ ఐరెస్, జపనీస్ అంతరిక్ష సంస్థకు చెందిన టకుయా ఒనిషి, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.