214మంది పాక్ జవాన్లను చంపేశాం!
పోరాటం ముగిసిపోలేదన్న బీఎల్ ఎ

ఇస్లామాబాద్: జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు హైజాక్ లో పాక్ ప్రభుత్వం వ్యవహరించిన మొండితీరుతో బందీలుగా ఉన్న 214 మందిని చంపివేశామని బీఎల్ ఎ శనివారం ప్రకటించింది. తమ పోరాటం ఇంకా ముగిసిపోలేదని ప్రకటన విడుదల చేసింది. పాక్ సైన్యానికి 48 గంటల పాటు హెచ్చరిక జారీ చేసినా తమపై దాడి చేసేందుకు ప్రయత్నించిందే గానీ, తమ బందీల ప్రాణాలు ఏమవుతాయన్నది ఆలోచించకుండా దురహంకారాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు. దీంతో తాము తీసుకున్న చర్యల్లో 214 మంది బందీలు హతమయ్యారని పేర్కొంది. బీఎల్ ఎ యుద్ధ సూత్రాలకు, అంతర్జాతీయ చట్టాలకు లోబడే వ్యవహరించిందన్నారు. ఈ పోరులో 12మంది బీఎల్ ఎ సమరయోధులు కూడా నేలకొరిగారని వారికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ పాక్ బందీల మృతదేహాల కోసం వెతుకుతుందని చెప్పారు. ఏది ఏమైనా తాము చేపట్టిన ఆపరేసన్ ‘దర్రా ఎబోలన్’ సక్సెస్ అయిందని ప్రకటించింది.