హమాస్ కు మద్ధతు భారతీయ విద్యార్థినీ వీసా రద్దు
Indian student's visa revoked for supporting Hamas

వాషింగ్టన్: హమాస్ కు మద్ధతు ఇస్తూ పలు ఆందోళనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలపై భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా రద్దు చేసింది. ఈ విద్యార్థిని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తుంది. వీసా రద్దు అయిన వెంటనే రంజనీ శ్రీనివాస్ అమెరికాను వీడి వెళ్లింది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. హమాస్ కు మద్ధతుగా ఈ విద్యార్థిని పలు ఆందోళనల్లో పాల్గొన్నారని తెలిపింది. ఎఫ్ 1 వీసాపై కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్బన్ ప్లానింగ్ లో పీహెచ్ డీ విద్యనభ్యసిస్తుందని తెలిపింది. తమ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఎవ్వరిపైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని అమెరికా కార్యదర్శి క్రిస్టినోయెమ్ స్పష్టం చేశారు. మార్చి 5న వీసా రద్దు చేయగా, మార్చి 11న ఈ విద్యార్థిని దేశం విడిచి వెళ్లిందని క్రిస్టినోయెమ్ స్పష్టం చేసింది.